30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ కూరగాయల సాగు.. సీఎం రేవంత్ సూచనలు

Writer: Chandrika 07:25 PM, 30 జులై, 2026
సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ కూరగాయల సాగు.. సీఎం రేవంత్ సూచనలు

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యవసాయ రంగంపై ఏర్పడుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కూరగాయల సాగు, ఆర్గానిక్ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలోని బోధి పెవిలియన్‌లో నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఆయన వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని సబ్సిడీపై విత్తనాలు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును విస్తరించాలని, ఆర్గానిక్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి వారు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. రైతులకు సాంకేతిక సూచనలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని సూచించారు.

నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది తగినంత వర్షపాతం లేకపోవడంతో సాగు విస్తీర్ణం గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 79.49 లక్షల ఎకరాల నుంచి 74.56 లక్షల ఎకరాలకు తగ్గింది. గ్రామాల వారీగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ఆయా పంటల విత్తనాలను 75 శాతం సబ్సిడీపై అందించడం, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయడం, డ్రిప్‌, స్ప్రింక్లర్‌ సాగు పద్ధతులకు 75 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ కల్పించడం, సాగునీటికి నిరంతర విద్యుత్ సరఫరా, పశుగ్రాస సాగు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల సాంకేతిక సహకారం, హైదరాబాద్‌ పరిసరాల్లో కూరగాయల సాగు విస్తరణ, రైతుబజార్లకు రవాణా సౌకర్యం, గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లకు ఆర్థిక సహాయం, అత్యవసర చర్యల అమలుకు గ్రామస్థాయి బృందాల ఏర్పాటు వంటి పలు కీలక సిఫారసులు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్‌ నిరసనకారులకు ఊరట..

నీట్‌ నిరసనకారులకు ఊరట..

నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

గోదావరిలో తొలి పులస సందడి..

గోదావరిలో తొలి పులస సందడి..

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణఎల్‌నినోకూరగాయల సాగుఆర్గానిక్ వ్యవసాయంరైతులువ్యవసాయ శాఖసబ్సిడీ విత్తనాలుడ్రిప్ సాగుసెంట్రలైజ్డ్ కిచెన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డీసీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల..
సినిమాలు

‘డీసీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల..

నీట్‌ నిరసనకారులకు ఊరట..
జనరల్

నీట్‌ నిరసనకారులకు ఊరట..

నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సైమా 2026 నామినేషన్స్‌ విడుదల..
సినిమాలు

సైమా 2026 నామినేషన్స్‌ విడుదల..

సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ కూరగాయల సాగు.. సీఎం రేవంత్ సూచనలు
జనరల్

సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ కూరగాయల సాగు.. సీఎం రేవంత్ సూచనలు

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్
రాజకీయాలు

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే
జనరల్

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక
క్రీడలు

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక

గోదావరిలో తొలి పులస సందడి..
జనరల్

గోదావరిలో తొలి పులస సందడి..

మెటాను వివరణ కోరిన కేంద్రం
టెక్నాలజీ

మెటాను వివరణ కోరిన కేంద్రం

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!
జనరల్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!