
రాజకీయాలు

దీపావళి పండుగ నేపథ్యంలో ఆహార పదార్థాల నాణ్యత, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నవంబర్ 4, 5 తేదీల్లో ప్రత్యేక తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 105 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు, మరో ఏడు సంస్థలు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో సుమారు 39,485 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1.35 కోట్లుగా అంచనా వేశారు. పండుగ సమయంలో నాణ్యత లేని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం. ప్రజారోగ్యం, ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!