

కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన దీపావళి వేడుకలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. స్టింగ్ ఆపరేషన్‌పై జరుగుతున్న విచారణ తీరుపై సిద్ధరామయ్య అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు, స్టింగ్ వీడియో వెనుక కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి హస్తం ఉందని సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఆరోపించారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే అంశంపై చర్చలు జరగడం పార్టీకి నష్టం కలిగించవచ్చని ఎమ్మెల్సీ రాజేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి నిర్ణయం తీసుకుంటే అహింద సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిణామాలతో కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!