
రాజకీయాలు

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కౌంటింగ్ గదిని మార్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయం కేవలం 600 ఓట్ల తేడాతోనే నిర్ణయమైందని, 2 వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా ఉన్నాయని పేర్కొన్నారు.
రీకౌంటింగ్ కోరుతూ పిటిషన్ వేయాలని తొలుత భావించినప్పటికీ, చెవిరెడ్డి కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నామని సుధారెడ్డి తెలిపారు. పెద్ద కుమారుడు ఇప్పటికే ఓడిపోయాడని, చిన్న కుమారుడు కూడా ఓడిపోతే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతాడని వారు వేడుకున్నట్లు చెప్పారు. మానవతా దృక్పథంతో రీకౌంటింగ్ పిటిషన్ వేయలేదని, ఇప్పుడు ఆ నిర్ణయం తప్పని అనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!