

జపాన్‌ను ఆదివారం తెల్లవారుజామున భూకంపం వణికించింది. నవంబర్ 8న ఒంటి గంట సమయంలో షిజువోకా ప్రిఫెక్చర్ పశ్చిమ ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐచి, నగానో, గిఫు ప్రిఫెక్చర్‌లలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భూకంప ధాటికి పలు ఇళ్లు, దుకాణాల కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రైల్వే మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగా బుల్లెట్ రైళ్ల వేగాన్ని తగ్గించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!