
జనరల్

అఫ్గానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో డైనమైట్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో 97 మంది గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం అందించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి, పేలుడు వెనుక ఉన్న కారణాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!