
సినిమాలు

ఢిల్లీలో ఉద్యోగ్ భవన్ సమీపంలోని స్లమ్ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి 20 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ ప్యానెల్‌లో మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!