
జనరల్

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని సినీనటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురువారం దర్శించుకున్నారు. హెలికాప్టర్‌లో మంత్రాలయానికి చేరుకున్న ఆమె.. తొలుత గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఉపాసనకు శేషవస్త్రం, జ్ఞాపిక, ఫలమంత్రాక్షితలను అందజేశారు. అనంతరం ఆమెను ఆశీర్వదించారు. ఉపాసన కొణిదెల మంత్రాలయం పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, ఆలయ సిబ్బంది సందడి కనిపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!