

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ జాబ్ మేళాలో సుమారు 100 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, పరీక్షల పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!