

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బీ-ఫామ్ కేటాయించిన పార్టీ అధిష్ఠానంపై, తనపై చిన్నారెడ్డి అభ్యంతరకర, అనైతిక, పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆగస్టు 16, 2026న గోపాల్పేట మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సమావేశంలో చిన్నారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని మేఘారెడ్డి ఆరోపించారు. పార్టీ అధిష్ఠానాన్ని విమర్శించడంతో పాటు నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై కూడా ఆయన విమర్శలు చేశారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఫిర్యాదుతో పాటు సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చిన్నారెడ్డిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీ వేణుగోపాల్‌ను మేఘారెడ్డి కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!