

మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్లోని వివేకానంద హై స్కూల్, పెర్సీస్ హై స్కూల్లో అధ్యాపకులకు పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా MGR మాట్లాడుతూ, అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అధ్యాపకులు చొరవ చూపాలని కోరారు. తోటి అధ్యాపకులకు, అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహ ముదిరాజ్, వెంకటేష్, ఉమా, ధనరాజ్, శశిరాజ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!