

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల వైపు కదులుతోంది. దీంతో తీర జిల్లాల్లో ఆందోళన నెలకొంది. గత ఆరు గంటలుగా తుపాను గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తాజా వివరాల ప్రకారం, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 340 కిలోమీటర్లు, బాపట్లకు 410 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 370 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
బుధవారం ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసినట్లు సమాచారం. యానాం పరిసర ప్రాంతాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుపాను అత్యంత తీవ్ర తుపానుగా బలపడితే గంటకు 125–135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సంభవించవచ్చని అంచనా. తీరప్రాంత ప్రజలు వాతావరణశాఖ తాజా హెచ్చరికలను, స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!