
క్రీడలు

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కే. షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న షణ్ముగానికి మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం గౌరవ మర్యాదలతో ఆయనను ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు ఇరువురికి ఘనస్వాగతం పలికారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!