

వియత్నాంలో జరిగిన టూరిస్ట్ పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. విహారయాత్రకు వెళ్లిన ఏపీ పర్యాటకులు ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలియజేయగా, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించాలని నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏపీ భవన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!