

నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన 3 వేల మందికి పైగా ఉపాధ్యాయులను విధుల్లోంచి తొలగించాలని బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారికి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన జీతభత్యాలను వడ్డీతో సహా తిరిగి వసూలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి మిథిలేశ్ తివారీ తెలిపారు. బిహార్‌లో 2006 నుంచి 2015 మధ్య జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో నిర్వహించిన సమగ్ర విచారణలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నకిలీ విద్యాసంస్థల పేరుతో జారీ చేసిన డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లను ఉపయోగించి అనేక మంది ప్రభుత్వోద్యోగాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ విచారణ భయంతో కొందరు ఉపాధ్యాయులు ముందే రాజీనామా చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాంటి వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!