

వింబుల్డన్ 2026 సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలైన సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. వచ్చే ఏడాది కూడా వింబుల్డన్‌లో తప్పకుండా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. సెమీఫైనల్ వరకు చేరుకోవడం ద్వారా తాను ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో పోటీ పడగలనని మరోసారి నిరూపించుకున్నానని పేర్కొన్నాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడి చేతిలో ఓడిన విషయాన్ని అంగీకరిస్తూనే తన పోరాట పటిమపై సంతృప్తి వ్యక్తం చేశాడు.
జకోవిచ్ మాట్లాడుతూ, ఇతర ఆటగాళ్లకు సెమీఫైనల్ చేరుకోవడం గొప్ప విజయమే అయినా తన లక్ష్యాలు ఎప్పుడూ అంతకంటే పెద్దవేనని చెప్పారు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆయన, మహిళల దిగ్గజం మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును అధిగమించే అవకాశాన్ని మరోసారి వాయిదా వేసుకున్నాడు. వింబుల్డన్ ప్రయాణం ముగియడంతో ఇప్పుడు అమెరికా హార్డ్‌కోర్ట్ సీజన్‌పై దృష్టి సారించి మరోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!