
రాజకీయాలు

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో అదనపు లడ్డూ పోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంటనే స్పందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారితో పాటు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన మంత్రి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారుల సత్వర స్పందనతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!