
సినిమాలు

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు కాఫీ ప్రత్యేకతను కొనియాడారు. తన దైనందిన జీవితం అరకు కాఫీతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప వారసత్వానికి అరకు కాఫీ ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
అరకును ప్రపంచ స్థాయి ప్రీమియర్ కాఫీ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పెట్టుబడులు పెడుతోందని చంద్రబాబు తెలిపారు. స్థానిక కాఫీ రైతులకు సాధికారత కల్పించడంతో పాటు ప్రపంచ కాఫీ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. అరకు కాఫీ ప్రయాణం రాష్ట్రంలోని కొండ ప్రాంతాల నుంచి ప్రపంచంలోని కాఫీ కప్పుల వరకు విస్తరిస్తోందని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!