
సినిమాలు

బెంగళూరులో నమ్మ మెట్రో ప్రయాణ ఖర్చులపై తాజాగా ఓ నివేదిక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. రోజువారీ మెట్రో ప్రయాణ ఖర్చును ఒక వ్యక్తి నెలవారీ ఆదాయంలో 5 శాతానికి లోపే ఉంచుకోవాలంటే సుమారు రూ.70,400 నెల జీతం అవసరమని నివేదిక పేర్కొంది. చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాల్లోని మెట్రో ప్రయాణంతో పోలిస్తే బెంగళూరులో అవసరమైన ఆదాయం ఎక్కువగా ఉందని తెలిపింది.
2025 ఫిబ్రవరిలో బెంగళూరు మెట్రో గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.90కు పెంచింది. అనంతరం ఆ పెంపును కొంత మేర వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా అనేక మంది ప్రయాణికులు నమ్మ మెట్రోను ఎంచుకుంటున్నారు. మరోవైపు, రోజువారీ ఆటో రిక్షా ప్రయాణానికి నెలకు రూ.14,000కు పైగా ఖర్చయ్యే అవకాశం ఉండటంతో మెట్రో ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!