
రాజకీయాలు

రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం ముందుకు సాగుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకే వేదికపై అన్ని సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
సమృద్ధి కేంద్రాల ద్వారా రైతుల పంటలు, స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులను ఈజీ మార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ కేంద్రంపై వచ్చే స్పందన ఆధారంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. పోస్టల్, బ్యాంకింగ్, ఆధార్ వంటి 11 సేవలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!