
జనరల్

2030 నాటికి దేశీయ ఔషధ ఎగుమతులను 50 బిలియన్ డాలర్ల (రూ.4.76 లక్షల కోట్లు)కు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. రవితేజ తెలిపారు. గత 12 ఏళ్లలో ఔషధ ఎగుమతులు సగటున 7.22% వార్షిక వృద్ధి సాధించి, 2014లో 14 బిలియన్ డాలర్ల నుంచి 2025-26లో 31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలో ఉత్పత్తి పరంగా భారత్ మూడో స్థానంలో, అమ్మకాల పరంగా ఏడో స్థానంలో ఉందని తెలిపారు. అమెరికా, యూరప్ దేశాలు ప్రధాన ఎగుమతి మార్కెట్లు కాగా, తెలంగాణ ఒక్కటే 35–40% వాటా కలిగి ఉందని చెప్పారు. కీలక ముడిసరకులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు, సరఫరా సమస్యల పరిష్కారం, APIలలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!