
జనరల్

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రమేష్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించి, వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
రమేష్‌కు ఉత్తమ వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరిన చిరంజీవి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. చికిత్స ఖర్చులకు సహాయంగా రమేష్ సతీమణికి రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. రమేష్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!