
జనరల్

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట సోషల్ మీడియాలో చేసే సరదా పోస్టులతో అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారు. తాజాగా నాగచైతన్య తన భార్య చేసిన వంట ఫొటోను పంచుకుంటూ సరదా వ్యాఖ్య చేయగా, అది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
పెళ్లైన దాదాపు రెండేళ్లకు తన భార్య ప్రత్యేకంగా వంట చేసిందని, ఈ రోజు తాను ఏదో మంచి పని చేసి ఉంటానేమో అని చమత్కరించారు. దీనికి శోభిత వెంటనే స్పందిస్తూ, తాను ట్రోల్ చేస్తున్నావా లేక పొగుడుతున్నావా అని ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఈ చిలిపి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!