

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. సోమవారం నవంబర్ 23న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై నేతలు చర్చించనున్నారు. 2026 మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా చేపడుతున్న తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన ఇదే.
ఈ భేటీలో ఇంధనం, జలవిద్యుత్, వాణిజ్యం, పెట్టుబడులు, రవాణా అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత్, నేపాల్ మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు విభేదాలకు పరిష్కార మార్గాలను అన్వేషించడంపై ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి. పర్యటనలో భాగంగా బాలేంద్ర షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!