
జనరల్

న్యూఢిల్లీలో రూ.105 కోట్ల వ్యయంతో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్‌ను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన్‌ను ఆధునిక పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే ఢిల్లీకి వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా ఈ భవన్‌ను నిర్మించనున్నారు.
ఈ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)కు అప్పగించారు. ఆధునిక సదుపాయాలతో రూపొందనున్న ఈ కొత్త ఏపీ భవన్ రాష్ట్ర పరిపాలనా అవసరాలకు తోడ్పడటంతో పాటు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!