
జనరల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్నారు.
నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదును నేరుగా జమ చేయనున్నారు. తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరింది. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులతో పాటు మహిళలకు ఈ పింఛన్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!