
జనరల్

ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలో చిన్నారులతో రాజకీయ అంశాలకు సంబంధించిన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన చిన్నారులతో రాజకీయ సందేశాలు ఉన్న వీడియోలను రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో మైనర్లను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించడం, వారి గోప్యత, హక్కుల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తాయి.
ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టి సారించింది. పిల్లల సోషల్ మీడియా వినియోగం, హానికరమైన కంటెంట్ నుంచి వారి రక్షణపై NHRC ఇప్పటికే చర్చలు నిర్వహించింది. చిన్నారుల హక్కులు, డిజిటల్ భద్రతకు తగిన రక్షణ చర్యలు అవసరమని కమిషన్ గతంలోనూ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!