

కర్ణాటకకు చెందిన ఓ రైతు యువకుడు సీఎం డీకే శివకుమార్‌ను కలిసి చేసిన ఆసక్తికరమైన వినతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు ఎకరాల కొద్దీ వ్యవసాయ భూమి ఉందని, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని చెప్పిన ఆ యువకుడు.. అయినప్పటికీ తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని సీఎంకు తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే పలు గ్యారంటీ పథకాలను అమలు చేస్తోందని, తమలాంటి రైతు యువకుల కోసం మరో పెళ్లిళ్ల గ్యారంటీ పథకాన్ని తీసుకురావాలని సరదాగా కోరినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో గ్రామీణ ప్రాంతాల్లో యువత పెళ్లిళ్లకు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది. ఒకప్పుడు ఎకరాల కొద్దీ భూమి ఉండటం పెళ్లి సంబంధాల్లో ప్రధాన అర్హతగా భావించేవారు. అయితే ప్రస్తుతం స్థిరమైన ఉద్యోగం, నెలవారీ ఆదాయం, పట్టణ జీవనశైలి వంటి అంశాలకు కుటుంబాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయనే అభిప్రాయం ఉంది. వ్యవసాయ ఆదాయంలో అనిశ్చితి, పంటలపై ఆధారపడాల్సి రావడం కూడా గ్రామీణ యువతకు పెళ్లి సంబంధాలు రావడంపై ప్రభావం చూపుతున్నాయా అనే చర్చ సాగుతోంది. ఈ రైతు యువకుడి వినతి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న యువత ఎదుర్కొంటున్న సామాజిక సవాళ్లను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!