
రాజకీయాలు

తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 1.24 లక్షల గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జియో ట్యాగింగ్, పోర్టల్‌లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని విగ్రహాల సంఖ్యను గుర్తించినట్లు చెప్పారు. ఈ లెక్కల్లో పబ్లిక్ ప్లేస్‌లలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయని డీజీపీ స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 8 వేల విగ్రహాలు పెరిగినట్లు తెలిపారు.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా గత 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 88 వేల గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు వెల్లడించారు. మిగిలిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!