
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. గతంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన ముద్రగడ అంత్యక్రియలను అంబటి రాంబాబు, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అంత్యక్రియల సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను అంబటి రాంబాబు అడ్డుకుని, నెట్టివేశారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై జూలై 15న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా అంబటి రాంబాబు పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!