

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా రూపుదిద్దుకుంటోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు కింద పోలీస్ స్టేషన్‌లోని వివిధ సేవలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో అనుసంధానం చేస్తున్నారు. ఈ సేవలను వచ్చే నెల మొదటి వారంలో డీజీపీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విధానం ద్వారా పోలీస్ సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘సేతు’ కియోస్క్ ద్వారా పది భాషల్లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఏఐ సాయంతో ఫిర్యాదులను స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు క్షణాల్లో పంపించనున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డైరీల నిర్వహణ, దర్యాప్తు నివేదికలు, ఛార్జిషీట్ల తయారీ వంటి ప్రక్రియల్లోనూ ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సజ్జనార్.. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!