
జనరల్

సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు హైదరాబాద్‌లో జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జనసేనకు చెందిన ఎంపీలు పాల్గొని పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా కీలక బిల్లులపై పార్టీ అధికారిక వైఖరిని పవన్ కల్యాణ్ వివరించనున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలను పార్లమెంట్లో సమర్థంగా ప్రస్తావించేందుకు ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!