

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు సాయి రూప్ ‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను సేవా కార్యక్రమాల రూపంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. యువతను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడం, ప్రజల్లో సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశం తమకు లేదని కూడా స్పష్టం చేశారు.
‘ఊరు–వాడ’ కార్యక్రమం యువజాగృతి, గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అనే మూడు ప్రధాన అంశాలపై సాగుతుందని సాయి రూప్ వివరించారు. తమ సంస్థపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. సమాజ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, సేవా కార్యక్రమాల ద్వారానే ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!