

రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తి భయాలు ఆందోళనకు కారణమవుతున్నాయి. సైబీరియాలోని యాంటీ ప్లేగు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ షిపిలోవా అనారోగ్యంతో మృతి చెందడం ఈ చర్చకు దారితీసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ల్యాబ్‌లో జరిగిన ఘటనకు ఆమె అనారోగ్యానికి సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రష్యా ప్రజారోగ్య అధికారులు మాత్రం ఆమె నిమోనియాతో మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఆమె శరీరంలో ప్రమాదకర సూక్ష్మజీవులు గుర్తించలేదని తెలిపారు.
సెప్టెంబరు 25న ప్రయోగశాలలో ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత షిపిలోవా అనారోగ్యానికి గురై, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఘటన అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, సహచరులు సహా సుమారు 200 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. పలు ఆసుపత్రుల్లో క్వారంటైన్ చర్యలు చేపట్టి, ఐదు ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్లేగు విస్తృతంగా వ్యాపించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!