

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో భోగాపురానికి చేరుకుని మధ్యాహ్నం 1:05 గంటల వరకు అక్కడే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయ టెర్మినల్‌ను పరిశీలించడంతో పాటు విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలకనున్నారు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు సౌకర్యాలు, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు, భారీ జనసమీకరణ వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!