10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

Writer: Pooja 02:56 PM, 10 సెప్టెంబర్, 2026
బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

వ్యవసాయంలో రైతన్నకు తోడుగా నిలిచే పశుసంపదపై ఉన్న ప్రేమకు పొలాల అమావాస్య ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి, పశుపక్ష్యాదులు, పంచభూతాలను వ్యవసాయంలో భాగస్వాములుగా భావించే రైతులు.. పంటల సాగులో సాయపడిన ఎద్దులను నందీశ్వరులుగా, భూమిని భూమాతగా, వర్షాన్ని వరుణ దేవుడిగా కొలవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ పండగను ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 11న పొలాల అమావాస్యను జిల్లాలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పండగ సందర్భంగా రైతులు తమ ఎద్దుల జతలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. తెల్లవారుజామున ఇళ్లను శుభ్రం చేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అనంతరం ఎద్దులు, ఇతర పశువులను చెరువులు, బావుల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించి పూజలు ప్రారంభిస్తారు. పసుపు, కుంకుమలతో ఎద్దులను అలంకరించి మంగళహారతులు ఇస్తారు. అమావాస్య రోజున మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారు చేసి పూజించే సంప్రదాయం కూడా ఉంది. గ్రామాల్లోని హనుమాన్‌ దేవాలయాలకు అలంకరించిన ఎద్దులను తీసుకెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.

పూజల అనంతరం ఎద్దులకు పిండి వంటలు, బూరెలు, నైవేద్యాలను సమర్పిస్తారు. వ్యవసాయానికి ఆయువుపట్టుగా నిలిచే ఎద్దులు కష్టనష్టాల్లో తమకు తోడుగా ఉంటాయని రైతులు విశ్వసిస్తారు. బసవన్నలను పూజిస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని నమ్మకం. పశుసంపదతో రైతులకు ఉన్న అనుబంధం, గ్రామీణ జీవన విధానం, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పొలాల అమావాస్య వేడుకలు తెలంగాణ పల్లెల్లో వైభవంగా సాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

మండల, జడ్పీ ఎన్నికలకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు..

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

రేవంత్ సొంత ఊరి దగ్గరే రైతుల రాస్తారోకో.. హరీశ్ రావు ఫైర్!

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

సీఎం రేవంత్ రెడ్డి రెట్రో లుక్ వైరల్

ట్యాగ్లు
పొలాల అమావాస్యబసవన్నల పూజతెలంగాణ పల్లెలురైతుల పండగగ్రామీణ సంస్కృతివ్యవసాయ సంప్రదాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...
క్రీడలు

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
జనరల్

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు
జనరల్

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్
రాజకీయాలు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...
క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!