
జనరల్

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మొత్తం 7,437 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగార్థులకు పెద్ద అవకాశంగా మారనున్నాయి. నోటిఫికేషన్ విడుదలతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.

పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ , ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు శాఖలకు సంబంధించిన నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలను అధికారిక నోటిఫికేషన్లో వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!