
జనరల్

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగింది. విచారణ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం, అనారోగ్య కారణాలతో ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరు కాలేకపోయారని వారి తరఫు న్యాయవాది వివరించారు. ఈ కేసులో హీరో అర్జున్ కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే.
ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు ఇంకా తమకు అందలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, తదుపరి విచారణ నాటికి అన్ని డిజిటల్ ఆధారాలు, పత్రాలను నిందితుల న్యాయవాదులకు అందజేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!