
టెక్నాలజీ

ప్రభుత్వ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతను పెంపొందించేందుకు ఈ బిల్లు కీలకంగా మారనుంది.
బిల్లు ఆమోదం అనంతరం పార్లమెంట్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే పరీక్షలలో అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో పాటు నియామక, పోటీ పరీక్షల విశ్వసనీయత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (1)
Good decision 👏👏