
జనరల్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులందరినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీలను ప్రకటించే వరకు ఎవరూ ప్రెస్‌మీట్లు, టీవీ డిబేట్లు లేదా ఇతర మీడియా వేదికల్లో పార్టీ తరఫున పాల్గొనవద్దని ఆదేశించారు.
నూతన అధికార ప్రతినిధుల కమిటీ నియామకం పూర్తయ్యే వరకు జనసేన పార్టీ పేరుతో ఎలాంటి మీడియా చర్చల్లోనూ పాల్గొనరాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!