24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

Writer: Harika S 06:46 AM, 24 ఆగస్టు, 2026
‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

భారత్‌లో కొంతకాలంగా నివసిస్తున్న పోలెండ్‌కు చెందిన డొమినికా పటాలస్‌ కల్రా.. భారతీయుల రోజువారీ జీవనశైలి, అలవాట్లపై చేసిన సరదా పోస్టుతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ‘నేను భారత్‌లో తప్ప ఇంకెక్కడా చేయలేని పనులు’ అనే క్యాప్షన్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పలు విషయాలను పంచుకున్నారు. భారతీయులు పాటించే కొన్ని అలవాట్లు విదేశీయులకు భిన్నంగా అనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు.

భారత్‌లో పరిచయం లేని వారిని కూడా భయ్యా, దీదీ, అంకుల్‌, ఆంటీ అని ఆప్యాయంగా పిలవడం, దారి తెలియకపోతే గూగుల్‌ మ్యాప్స్‌ కంటే రోడ్డుపై కనిపించే వారిని అడిగి వారి మాట నమ్మడం వంటి విషయాలను ఆమె ప్రస్తావించారు. పొరుగింటి వారు ఇచ్చే ఆహారాన్ని తిరస్కరించలేమని, అలా చేస్తే ఎదుటివారిని అవమానించినట్లు భావించే పరిస్థితి ఉంటుందని సరదాగా చెప్పారు. పరిచయం ఉన్న ఆంటీలు తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌, పెళ్లి, బరువు, భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేసినా వాటిని సాధారణంగానే తీసుకుంటానని తెలిపారు.

ఇతరుల ఇళ్లకు అకస్మాత్తుగా వెళ్లినా ఆత్మీయంగా ఆహ్వానించడం, కొద్దిసేపు మాట్లాడిన తర్వాతే ఆటో డ్రైవర్‌ను నమ్మి ప్రయాణించడం కూడా భారత్‌లో తనకు అలవాటైపోయిన విషయాలుగా డొమినికా పేర్కొన్నారు. రోడ్డు పక్కన శుభ్రతపై పెద్దగా నమ్మకం కలగని స్టాల్స్‌లోనూ స్ట్రీట్‌ఫుడ్‌ను ఆస్వాదిస్తానని, అదే సమయంలో విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఫుడ్‌ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని సరదాగా చెప్పారు. చిన్న దుకాణంలో గాజు గ్లాస్‌లో టీ తాగడం కూడా తనకు ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.

పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు పెద్దగా పరిచయం లేని వారితోనూ కుటుంబ సభ్యురాలిలా కలిసిపోవడం, ఎవరైనా తన కోసం ఎదురుచూస్తున్నప్పుడు ‘ఇప్పుడే బయల్దేరాను.. ఐదు నిమిషాల్లో వస్తాను’ అని చెప్పి, అప్పటికీ ఇంట్లోనే రెడీ అవుతూ ఉండటం వంటి విషయాలను కూడా ఆమె తన జాబితాలో చేర్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందించారు.

‘చివరి పాయింట్‌ అక్షరాలా నిజం’, ‘మీరు ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు’ అంటూ పలువురు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు భారతీయుల ప్రేమ, ఆతిథ్యాన్ని అందంగా వివరించినందుకు డొమినికాకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె చెప్పిన విషయాలు భారతీయుల రోజువారీ జీవితాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయంటూ నెటిజన్లు ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ట్యాగ్లు
డొమినికా పటాలస్‌ కల్రాఇండియా వైరల్‌ పోస్ట్‌పోలెండ్‌ మహిళభారతీయ సంస్కృతివైరల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌భారతీయ జీవనశైలిసోషల్‌ మీడియా వైరల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన
జనరల్

అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్
జనరల్

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!
జనరల్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?
జనరల్

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్
జనరల్

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్
సినిమాలు

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి
జనరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు
జనరల్

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!
జనరల్

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
జనరల్

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...
జనరల్

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!