

దివంగత తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయన జీవించి ఉన్న సమయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఆయన మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వంటి కీలక పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ, ఇతర నేతలకు మాత్రం అవకాశాలు కల్పించారని ఆరోపించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చిందని, హైదరాబాద్కు తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, అధికారిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని మంత్రి తెలిపారు. ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుని, అధికారం కీలక పదవులను కొందరికే పరిమితం చేశారని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి రాజకీయాలకు తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన సమాధానం ఇస్తారని ఆయన అన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!