
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. సుప్రీంకోర్టు పరిణామాల నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను వేగవంతం చేయడంపై అధికారులు చర్చించారు.
దశల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది. ఓటర్ల జాబితాలు, ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన ఓటర్ల జాబితాల ఆధారంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!