

ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా-2026 మహిళా సాధికారతకు, గ్రామీణ మహిళల ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తన ప్రసంగంలో రాష్ట్రపతి మాట్లాడుతూ, మహిళలు సంకల్పబలంతో ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని పేర్కొన్నారు. తన జీవిత ప్రయాణం మహిళలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు సరస్ మేళా కీలక వేదికగా నిలుస్తోందని రాష్ట్రపతి వివరించారు. ఈ మేళాలో సుమారు 650 స్టాళ్లను ఏర్పాటు చేసి గ్రామీణ మహిళల నైపుణ్యాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఏడాది పొడవునా మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా మరింత కృషి చేయాలని ఆమె సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!