
ఆరోగ్యం

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా అక్టోబర్ 14, 15 తేదీల్లో రాష్ట్రపతి విజయవాడలో పర్యటించనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడకు దేశవ్యాప్తంగా మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడలో నిర్వహించనున్న స్వచ్ఛ మారథాన్‌కు ఇప్పటికే 22 రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్లు వచ్చాయని కేశినేని చిన్ని తెలిపారు. నగరంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, విజయవాడలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి నగర ప్రత్యేకతను దేశవ్యాప్తంగా చాటేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!