
రాజకీయాలు

పుణెలోని విప్రో కార్యాలయంలో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలపై కంపెనీ స్పందించింది. సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లు మతం మార్చాలని ఒత్తిడి చేశారని ఆమె చేసిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని, కార్యాలయాల్లో వివక్ష లేదా వేధింపులను ఏమాత్రం సహించబోమని విప్రో స్పష్టం చేసింది.
ఈ కేసులో పుణె అధికారులు చేస్తున్న విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పోలీసులు కోరిన పత్రాలను సమర్పించినట్లు వెల్లడించింది. హింజవాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆరోపించగా, కేసు ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ వరకు చేరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!