
షోస్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు. కొంతమంది ఔత్సాహికులతో కలిసి ‘అన్‌హైప్’ పేరుతో స్కిన్‌కేర్ ఉత్పత్తుల యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉత్పత్తుల అభివృద్ధిలో తాను కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యానని విజయ్ తెలిపారు. మార్కెట్లోకి తీసుకురాకముందు దాదాపు తొమ్మిది నెలల పాటు స్వయంగా వినియోగించి పరీక్షించినట్టు చెప్పారు.
18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కిన్‌కేర్ ఉత్పత్తులను రూపొందించినట్టు విజయ్ వెల్లడించారు. ఈ నెల 21న ఉత్పత్తులను పెద్దఎత్తున మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు. విజయ్ ఇప్పటికే ‘రౌడీ’ బ్రాండ్ ద్వారా అపారెల్ వ్యాపారంలో ఉన్నారు. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లను కూడా నిర్వహిస్తున్నారు. తాజా స్కిన్‌కేర్ వెంచర్‌తో ఆయన వ్యాపార విస్తరణ మరింత ముందుకు సాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!