

ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపికపై బ్యాంక్ దృష్టి సారించింది. మూడేళ్ల కాలానికి ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రాధాన్యత క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సిఫారసు చేసినట్టు తెలిపింది. అయితే ఈ నియామకం ఆర్‌బీఐ తుది ఆమోదానికి లోబడి ఉంటుంది.
ఆర్‌బీఐకి పంపిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ డిప్యూటీ ఎండీ పరేశ్ సుతాంకర్, భారత్‌లో సిటీ చీఫ్ కంట్రీ ఆఫీసర్ కే. బాలసుబ్రమణియన్, ఆదిత్య బిర్లా గ్రూప్ సీఈఓ విశాఖ మూల్యే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ జిమ్మీ టాటా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీ, సీఈఓ విభా పదాల్కర్ వంటి పేర్లు పరిశీలనలో ఉండొచ్చని తెలుస్తోంది. అయితే తుది నియామకం ఆర్‌బీఐ ఆమోదంపైనే ఆధారపడి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!