

మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కుమారుడు, ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన కేసులో పుంగనూరుకు చెందిన సిమ్‌కార్డు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో రేవన్న వద్ద ఫోన్ లభించడంతో కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన అతావుల్లా పేరుతో సిమ్‌కార్డు జారీ అయినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
దీంతో పుంగనూరుకు వచ్చిన పోలీసులు అతావుల్లాతో పాటు నాగపాళెంకు చెందిన స్టార్ మొబైల్స్ నిర్వాహకుడు నూర్ అహమ్మద్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. పుంగనూరు నుంచి సిమ్‌కార్డు జైలుకు ఎలా చేరింది, దాన్ని ఎవరు వినియోగించారు, రేవన్నతో స్థానికులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!