

షిరిడీ సాయిబాబాను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన అభ్యంతరకర యూట్యూబ్ వీడియోలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సంబంధిత వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలన్న ఫిర్యాదును పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ)ని ఆదేశించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది.
సాయిబాబాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోల తొలగింపుపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గతంలోనే జీఏసీకి సూచించింది. ఈ నేపథ్యంలో జీఏసీ ఇటీవల కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, మరికొన్ని వీడియోలు ఇంకా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ వ్యవహారంపై కోర్టు మరోసారి సంబంధిత సంస్థల నుంచి వివరణ కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!